Saturday, March 20, 2010

మత యుద్దాలు - మారణ హొమాలు - బాధ్యులెవరు?


మీరు కారణ జన్ములు. ఈ  బ్లాగ్  వీక్షిస్తున్న మీకు  ప్రత్యేక  ధన్యవాదాలు.   మీరు కారణ జన్ములంటే బహుశా  నమ్మకం  కలుగటం  లేదేమో.   ఆ మాటకొస్తే  మీరే  కాదు  ప్రతి  మనిషి  కారణజన్ముడే (జన్మురాలే).  అది తెలియక అకారణంగా ఎందరో అంతరించారు అంతరిస్తూనే ఉన్నారు.   కొందరు మాత్రమే  పైకి  రాగలిగారు  శాశ్వతంగా  చరిత్ర  పుటల్లో మిగిలిపోయారు.     ఒకసారి గమనించండి. ఈ బ్లాగ్ లోకి  ప్రవేశించక  ముందు  మీ  ఆలోచన  ఎలాంటిది? ఎలాఉంది?  మీకు  తెలియకుండానే  ఏదో తెలుసుకోవాలనే తపన ఉండిఉంటుంది  కదూ.  ఆ  తపనే  ప్రతి  మనిసిలొనూ  ఉండేది.  అందుకే కదా  అది  బిగ్బాంగ్  వరకు  వెళ్ళింది.  ఇక  విషయానికి  వద్దాం.  అనవసరమైన  ద్వేషం  లేకుండా  సహృదయంతో  పరిశీలించండి:     


కొంతకాలం  క్రితం  హిందూ ధర్మ  జాగరణ  సమితి  పేరిట  కొందరు  కొన్ని  ప్రశ్నలు  లేవనెత్తారు.  దానికి జవాబుగా  క్రైస్తవ  పరిషత్  పేరిట  సమాధానాలు ఇచ్చారు. ఆసక్తికరమైన  ఈ  ప్రశ్నోత్తరాలు  గమనిద్దాం. 

జాగరణ  సమితి  ప్రశ్న: 


ఒక చేత్తో కత్తి,  ఒక చేత్తో బైబుల్ పట్టుకుని మతయుద్ధాలు చేసి, కోట్లాదిమంది  గొంతులు కోసి,  రక్తాన్ని ఏరులై  పారించిన  ఘనత  మీ  మతానిది  కాదా!

పరిషత్  సమాధానం:


నిష్కారణంగా, అనవసరంగా, ప్రజలను  హతమార్చి  రక్తపుటేరులు  పారించిన  వ్యక్తులు అన్ని మతాలలొనూ ఉన్నారు.  అలంటి కొందరు నాస్తికులు కూడా ఉన్నారు. ఒక మతంలోని వ్యక్తులు తప్పు చేసినంత  మాత్రాన  ఆ  మతం  తప్పు  చేసినట్టు  కాదు.  క్రైస్తవ మతస్థులు  కొందరు  అనవసర  రక్తపాతం జరిగించిన  మాట  వాస్తవమే.  అయితే  అలా చేయమని  బైబుల్  చెప్పలేదు.  ఏసుక్రీస్తు  ప్రభువు చెప్పలేదు.  అందుచేత  అది  క్రైస్తవ మతం  చేసిన  తప్పు  కాదు;  క్రైస్తవ  మతం  లో  ఉంటూ  క్రీస్తు భోదనలను పెడచెవిని పెట్టిన నకిలీ క్రైస్తవుల చేత  ఆ  రక్తపాతం  జరిగింది.  అలాంటి  వ్యక్తులు వాస్తవానికి  క్రైస్తవులు  కారు.  వారి  ప్రవర్తన  క్రైస్తవ  మత  సిద్దాంత  ప్రకారమైనది  కాదు.

జాగరణ సమితి ప్రశ్న:


'మంత్ర గత్తె' లు అనే  నెపంతో లక్షలాది మంది అమాయక  స్త్రీలను నిర్దాక్షిణ్యంగా  చంపినా  ఘనత  మీ మతానిది కదా!

పరిషత్ సమాధానం:


ఈ ప్రశ్నకు కూడా పై జవాబే వర్తిస్తుంది.  అలా మంత్రగత్తెలను  చంపమని  ఏసుక్రీస్తు ఆదేసించలేదు.  అసలు ఏ కారణం చేతనైనా నరహత్య  చేయకూడదని  బైబుల్ స్పష్టంగా అజ్ఞాపిస్తుంది.  ఆ మాట  కొస్తే  మంత్రగత్తెలు, మంత్రగాళ్ళు అనే  నేరం మోపి  కొందరు వ్యక్తులను  రాళ్లతో,  కర్రలతో  కొట్టి  చంపుతున్న సంఘటనలు  భారత దేశంలో   పల్లెలలో కూడా   ఎన్నో  జరుగుతున్నాయి.  అలా  చంపుతున్న  వారు  క్రైస్తవులు  కారని  మీకు తెలుసు.  ఏదిఏమైన  ఒక  మతంలోని  వ్యక్తులు  చేసే  అజ్ఞానపు  పనులు  ఆ మతం లోని దైవావతారానికి, మతగ్రంధానికి  మనం  ఆపాదించకూడదు.   ఈ  సూత్రం  అన్ని మతాలలోని  వ్యక్తులకు  వర్తిస్తుంది. 


(ఓపిగ్గా ఇంతవరకూ చదివిన మీకు మరోసారి ధన్యవాదాలు. అందుబాటులో లేని వారికోసం ఎన్నో ఉన్నాయి.  ఇంకా మరికొన్ని మరలా కలిసాక) 
  

7 comments:

  1. సూర్యప్రకాష్ గారు,
    చెడ్డ వ్యక్తుల వలన మతాలలు చెడ్డపేరు వస్తుందనేది కొంత వరకూ సరైనదే. అంటే మతాలు మనిషి స్వభావం మీద తమకు పూర్తి నియంత్రణ లేదు అని ఒప్పుకొంటున్నాయన్నమాట. ఒక మనిషి చెడ్డపని చేయగానే "వాడు మా మతం వాడే కాదు" అంటం మతాన్ని శుధ్ధం గా ఉంచాలనుకొంటున్న వారి ఉద్దేశాన్ని తెలుపుతోంది. మతాన్ని మనుషులకు దూరం గా ఆచరణ కు దూరం గా ఒక అందని పీఠం పై కూర్చోపెట్టంటం వలన దాని స్వచ్చత ఐతే రక్షించబడుతుందేమో కానీ మనిషి కి ఒరిగేది ఏమీ లేదు. కాబట్టీ మతాలన్నీ "మా వలన సామాన్య మానవుడి స్వభావం లో గొప్ప మార్పు ఏమీ రాదు" అని ఒప్పుకోవటం మంచిది. ఏసు కో కృష్ణుడి కో మతాన్ని గురించి నేర్చుకోవలసిన అవసరం ఎలానూ లేదు. ఆ స్థాయి వ్యక్తులకి ఆధ్యాత్మిక అనుభవాలు ఎలానూ కలుగుతాయి.
    మనుషులు ఆచరించలేని ఒక ఆదర్శాన్ని స్రుష్టించటం చాలా తేలిక. అది మన మనసు సౄష్టించే ఒక ఊహ మాత్రమే. మానవ స్వభావాన్ని ఆధారం చేసుకోని ఆచరణ యోగ్యం కాని ఏ మతమూ ఆదర్శమైనా నిలబడవు.
    మానవ స్వభావం ఆధారం గా వచ్చిన కొన్ని విజయవంతమైన సంస్తలకు ఉదాహరణలు:: అమా నాన్న అనే కుటుంబ విషయాలు, విద్యా ఉద్యోగాలు.
    ఐతే, ప్రాథమికమైన మానవ స్వభావం అంత త్వరగా మారక పోయినా, మానవ స్వభావం లోని కొన్ని అంశాలు కాలానుగుణ్యం గా మారుతూ ఉంటాయి, దీనికి అనుగుణం గా సంస్థలు కూడా మారాలి.
    మనుషులందరూ మంచివాళ్ళైతే ఇంక మతాలు చేసేదేమిటి? మనుషులందరూ మంచి వాళ్ళైతే వారిది ఏమతమైనా పరవాలేదు...ఏ సిధ్ధాంతమైనా పరవాలేదు. ఏది మంచి ఏది చెడు అనేది వేరే చర్చ.

    ReplyDelete
  2. ఒక మతం ఆ మతాన్ని అవలంబిస్తున్న వారి ప్రవర్తనను మంచిగ ఉంచటం లో విఫలమైనప్పుడు, ఆ వైఫల్యాన్ని అంగీకరించటం మంచిది.

    ReplyDelete
  3. andhrudu gaaru
    చాలా బాగ చెప్పారు. అదే నా వాదన కూడా. మతం పేరిట అరాచకాలు మాత్రమే జరుగుతూ మంచి ఏదీ ఒరగనప్పుడు మతం గొప్పది అని చెప్పుకోవడం ఎందుకు? ఒకవేళ మతంలో మంచి విషయాలున్నా కూడ అవి పనికిరావట్లేదే, అటువంటప్పుడు మతం ఊసేందుకు?

    ReplyDelete
  4. చాలా విషయాలలో మనిషి మతానికి సెకండరీ ప్రయారిటీ ఇస్తాడు. మతం కంటే ఎక్కువ మత్తు ఎక్కించే మందులు కూడా ఉన్నాయి. దాని గురించి ఇందులో వ్రాసాను http://blogzine.sahityaavalokanam.gen.in/2010/04/blog-post_22.html

    ReplyDelete
  5. Andhrudu

    నాస్తికత్వం మనుషులని పశువులు చేస్తున్నాప్పుడు దాని వైఫల్యం కూడా అంగీకరించడం మంచిది.

    ReplyDelete
  6. Malakpet Rowdy:
    Correct sir.
    But atheism never claimed it will make good men

    ReplyDelete
  7. స్పందించిన, ప్రతిస్పందించిన ప్రతి మనసుకూ ధన్యవాదాలు. ఆలస్యానికి మన్నించాలి. మీ స్పందనలు నాకు మత్రమేకాదు కొందరైనా సమాజ శ్రేయోభిలాషులకు స్పూర్తి దాయంకం కావాలని ఆశిస్తున్నాను.

    ReplyDelete