Thursday, April 29, 2010

ఏర్చి, కూర్చి, మార్చి వ్రాసిన బైబుల్ గ్రంధం ఎలా నమ్ముతున్నారు!

ప్రశ్నోత్తరాల  పరంపరలో మరికొన్ని...
హిందూ జాగరణ సమితి ప్రశ్న (7) :
మీ పవిత్ర గ్రంధం బైబిలును ఒక వ్యక్తి రాయలేదని, అనేకమంది, అనేక కాలాల్లో, అనేక భాషల్లో ఏర్చి, కూర్చి, మార్చి వ్రాసిన గ్రంథమని మీకు తెలుసా! మీ గ్రంధం క్రీస్తు తదుపరి సుమారు నాలుగు దశాబ్దాల కాలం తరువాత వెలువడిందని మీకు తెలుసా! అన్ని వందల సంవత్సరాలు ఎందుకు పట్టిందో చెప్పగలరా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :
మా పవిత్ర గ్రంధం అయిన బైబుల్ ఎలా వ్రాయబడిందో మాకే తెలియదని జాగరణ సమితి వారు భావించటం వారి గొప్ప "జ్ఞానానికి" తార్కాణం!
మహాశయులారా! మా పరిశుద్ధ గ్రంధమైన బైబుల్ ఒకే పుస్తకం కాదు. అది 66 పుస్తకాల సంకలనం. 1,600 ఏళ్ళ పాటు, వేరు వేరు దేశాలలో, ఒకరితోనోకరికి ఏమాత్రమూ పరిచయం లేని 40 మంది ప్రవక్తల ద్వారా హెబ్రీ, గ్రీకు, అరామిక్ భాషలలో వ్రాయబడిన 66 గ్రంధాలను కలిపి ఒక గ్రంధంగా కూర్చి చూస్తే, పూసల దండలో దారం ఉన్నట్లు ఆ 66 గ్రంధాలలో ఒకే సందేశం ప్రవహిస్తూ ఉండటం మేము గమనించాము. బైబుల్ దైవ గ్రంథమని మేము నమ్మడానికి ఇది కూడ ఒక కారణం.
ఆ 40 మంది ప్రవక్తలనూ ఒకానొక మానవాతీత దైవశక్తి నడిపించి వ్రాయించిందని మాకు నిరూపణలు దొరికాయి. బైబుల్లోని మొదటి గ్రంధం క్రీస్తు పూర్వం 1500 ఏళ్ళనాడు వ్రాయబడింది. చివరి పుస్తకం క్రీస్తు శకం నూరేళ్ళ నాడు వ్రాయబడింది.
హిందూ జాగరణ సమితి ప్రశ్న (8) :
ఇన్ని తప్పులు దొర్లినా మీ గ్రంధాన్ని ఇంకా దేవుని వాక్కుగా మీరు నమ్ముతున్నారా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :
ఏం తప్పులు దొర్లాయి మహాశయా?! ఎక్కడ తప్పులు దొర్లాయో బైబుల్లో వచనాలను చూపించకుండానే " - ఇన్ని తప్పులు దొర్లినా" అంటున్నారంటే, ఏలినవారి ఉబలాట మంతా క్రైస్తవ్యాన్ని దూషించటంలోనే ఉన్నదని అర్ధమౌతున్నది.
హిందూ జాగరణ సమితి ప్రశ్న (9) :
మీరు దాన్ని దేవుని వాక్కుగా నమ్మితే మీ దేవునికి ఈ చిన్న విషయాలు ఎందుకు తెలియకుండా పోయాయి!
క్రైస్తవ పరిషత్ సమాధానం :
అసలు బైబులులో శాస్త్రవిరుద్ధమైన విషయాలు లేనే లేవని మీము ఇదివరకే స్పష్టికరించాము గనుక "మీ దేవునికి ఈ చిన్న విషయాలు తెలియకుండా ఎందుకు పోయాయి?" అన్న ప్రశ్నే ఇక్కడ అసంగతమూ, అర్ధరహితమూ అయిపొయింది.
పైపెచ్చు "మీ దేవుడు" అన్న పదప్రయోగమే అత్యంత అభ్యంతరకరం. ఏ దేవుడు హిందువులను సృష్టించాడో, ఆ దేవుడే క్రైస్తవులను, ముస్లింలను సృష్టించాడని మా ప్రగాఢ విశ్వాసం అందుచేత మీ దేవుడు, మా దేవుడు అంటూ మాట్లాడటం అత్యంత అభ్యంతరకరం. అలాంటి పదప్రయోగం పండితులకు యోగ్యమైనది కాదు.
(మీ సమయాన్ని వెచ్చించి ఓపిగ్గా చదివిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అందుబాటులో లేని వారికోసం ఇంకా మరికొన్ని మరలా కలిసాక)

1 comment:

  1. క్రీస్తు గురించి వేదాలు చెప్తున్నాయా? కొన్ని పొరపాట్లు అన్ని మతగ్రంధాలలో ఉన్నాయ్. వందల సంవత్సరాల క్రితం రాసిన వాటిలో ఇది సహజం.ఇంకా మనం ఎవరి మతం,ఎవరి దేవుడు గొప్ప అనే చర్చలో ఉండటమే బాదాకరం.అన్ని మతాల సారం వకటే అని ఏ రెండు మతగ్రంధాలు చదివినా తెలుస్తుంది.

    ReplyDelete